ప్రభాస్ సినిమాలో కత్రినాకైఫ్? నిజ‌మేనా?

Reports say Katrna Kaif being considered for Prabhas's Saaho
Tuesday, May 16, 2017 - 16:00

అవును.. ప్రభాస్ కొత్త సినిమా కోసం కత్రినాకైఫ్ ను ట్రైచేస్తున్నారు. బహుశా ఈసారి కత్రినాకైఫ్ కాదనకపోవచ్చు. ఎందుకంటే బాహుబలి ప్రాజెక్టుతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇలాంటి హీరో సరసన నటిస్తే క్రేజ్ లోకల్ గానే ఫిక్స్ అయిపోకుండా, దేశవ్యాప్తం అవుతుంది. కత్రినాకు కావాల్సిందే అదే. కాకపోతే ఈ కాంబినేషన్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. 

వచ్చేనెల 10 నుంచి సాహో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలామంది పేర్లు పరిశీలించారు. ఫైనల్ గా కత్రినాకైఫ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం కత్రినాకైఫ్ తో చర్చలు జరుపుతున్నారు. తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలతో సినిమాలు చేసింది కత్రిన. కాకపోతే అది కెరీర్ స్టార్టింగ్ లో మాత్రమే. సల్మాన్ ఖాన్ చలవతో బాలీవుడ్ లో బాగా పాతుకుపోయింది ఈ బ్యూటీ. 

అప్పట్నుంచి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బాలీవుడ్ పడడం లేదు కత్రినాకు. అందుకే సినిమాలు తగ్గించింది. ఖాళీ దొరికితే చాలు తన స్వదేశం లండన్ కు వెళ్లిపోతోంది. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ మూవీలో ఆఫర్ కాబట్టి, కత్రినా మరోసారి టాలీవుడ్ కు వచ్చే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి.