రెచ్చిపోయిన గది 3, తుస్సుమన్న ఎవరు

RGG3 posts great numbers and Evaru low TRP
Friday, January 3, 2020 - 22:15

సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ మధ్య వ్యత్యాసం క్లియర్ గా ఉంటుంది. వెండితెరపై హిట్ అయిన సినిమాకు బుల్లితెరపై అదే స్థాయిలో టీఆర్పీ వస్తుందనుకుంటే అపోహ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహర్షి సినిమా. ఇక సిల్వర్ స్క్రీన్ పై  పెద్దగా సందడి చేయని సినిమాకి ... టీవీల్లో కూడా అతి తక్కువ టీఆర్పీ వస్తుందనుకుంటే భ్రమే. దీనికి బెస్ట్  ఎగ్జాంపుల్ రాజుగారి గది 3.

అవును.. ఈ వారం రేటింగ్స్ లో రాజుగారి గది 3  సినిమా దుమ్ముదులిపింది. స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమమైన ఈ సినిమాకు ఏకంగా 11.57 (అర్బన్) టీవీఆర్ వచ్చింది. ఇది చాలా మంచి రేటింగ్. మహేష్, బన్నీ నటించిన కొన్ని సినిమాలు కూడా గతంలో 10 టీవీఆర్ దాటలేకపోయాయి. అలాంటిది రాజుగారి గది 3 సినిమా ఆ మార్క్ క్రాస్ చేసింది.

ఇక వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన మరో సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆదరించలేదు. అదే "ఎవరు" సినిమా. బుల్లితెరపై చిన్నసైజు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేస్తే కేవలం 4.08 రేటింగ్ మాత్రమే వచ్చింది. థియేటర్లలో హిట్ అయినా, హోమ్ థియేటర్ లో ఈ సినిమా మెప్పించలేకపోయిందన్నమాట.