"మర్డర్"తో జాగ్రత్తపడిన వర్మ

RGV is careful about Powerstar?
Sunday, July 5, 2020 - 22:30

"మర్డర్" సినిమాపై కేసు పడింది. ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని... అమృత, మారుతిరావు, ప్రణయ్ తదితర పేర్లను ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రణయ్ తండ్రి కోర్టను ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. షూటింగ్ ను ఆపడానికి నిరాకరించినప్పటికీ.. దర్శకనిర్మాతలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు మిర్యాలగూడ పోలీసులు ఆర్జీవీ, నట్టికుమార్ లపై కేసు నమోదుచేశారు.

ఈ అనుభవంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న "పవర్ స్టార్" అనే సినిమా విషయంలో జాగ్రత్తపడుతున్నాడు వర్మ. పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని ఘట్టాలతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడనే విషయం అందరికీ తెలుసు. ఈ మేరకు పవన్ ను పోలిన వ్యక్తితో ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు వర్మ.

ఇప్పుడీ సినిమాపై కూడా "మర్డర్" తరహాలో కేసు పడుతుందని ఊహించిన ఆర్జీవీ ముందుజాగ్రత్త చర్యగా ప్రకటన చేశాడు. "పవర్ స్టార్" అనే సినిమా ఫిక్షన్ కథతో వస్తోందని ట్వీట్ చేశాడు వర్మ.

ఓ పెద్ద సినిమా స్టార్ రాజకీయ పార్టీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయే లైన్ తో "పవర్ స్టార్" అనే మూవీ వస్తోందని ప్రకటించిన వర్మ.. వాస్తవంగా ఇది ఎవరికైనా దగ్గరగా అనిపిస్తే అది కేవలం యాథృచ్ఛికమే తప్ప నిజం కాదంటున్నాడు.