తాతయ్య వాలంటైన్స్ డే సంబరాలు

RGV celebrates VDay with models
Saturday, February 15, 2020 - 09:00

రీసెంట్ గా తాత అయ్యాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతడి కూతురు తల్లి అవ్వడంతో, ఆటోమేటిగ్గా ఆర్జీవీ తాత అయినట్టయింది. అయితే వయసురీత్యా తాత అయినా, మనసులో మాత్రం ఇంకా కుర్రచేష్టలు పోలేదు. తాత అయిన తర్వాత ఇక కుర్రవేషాలు కట్టిపడేస్తాడని అంతా అనుకున్నారు. కానీ వాలంటైన్స్ డే సందర్భంగా అందరికీ షాకిచ్చాడు వర్మ.

ప్రేమికుల రోజున ఎవరైనా తమ గర్ల్ ఫ్రెండ్ తో గడుపుతారు. కానీ వర్మ ఒక అమ్మాయికి ఫిక్స్ అవ్వడు కదా. అందుకే ఇలా చుట్టూ అమ్మాయిల్ని పెట్టుకొని వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఎప్పట్లానే వోడ్కాతో సెలబ్రేట్ చేసుకున్న వర్మ, ఈసారి వాలంటైన్స్ డే కాబట్టి చుట్టూ హాట్ హాట్ అమ్మాయిల్ని పెట్టుకున్నాడు.

ఈసారి వర్మ కేవలం ఫొటో మాత్రమే పెట్టాడు. ఎలాంటి కామెంట్ పెట్టలేదు. అయితే ఆ ఛాన్స్ నెటిజన్లు తీసుకున్నారు. వర్మ ఫ్యాన్స్ మరోసారి అతడ్ని పొగడ్తల్లో ముంచెత్తారు. నువ్వు తగ్గొద్దు అంటూ ప్రోత్సహించారు. మిగతా జనాలు మాత్రం కాస్త గట్టిగానే గడ్డిపెట్టారు.