ఇక అప్సరకి లిఫ్ట్ ఇస్తున్నాడు

RGV introducing Apsara Rani
Monday, July 6, 2020 - 12:00

వర్మ క్యాంప్ నుంచి కొత్త భామలు వస్తూనే ఉంటారు. ఎంత మంది క్లిక్ అయ్యారనేది ఆర్జీవీకి అనవసరం. తన కథ, సినిమా వరకు వాళ్లు పనికొచ్చారా లేదా అనేది మాత్రమే వర్మ చూస్తాడు. మొన్నటికిమొన్న డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్ స్వీటీగా మార్చేశాడు. అంతకంటే ముందు మియా మాల్కోవాను పరిచయం చేశాడు. ఇప్పుడు మరో డాన్సర్ ను హీరోయిన్ ను చేస్తున్నాడు. ఆమె పేరు అప్సర రాణి.

ఒరిస్సాకు చెందిన అప్సర రాణి, డెహ్రాడూన్ లో పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. బేసిగ్గా ఈమె డాన్సర్. ఇప్పుడీమెను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు వర్మ.

Check: Apsara Rani Photoshoot

"అప్సరను కలిసే ముందు వరకు ఒరిస్సా గురించి నాకేం తెలియదు. కేవలం 1999లో వచ్చిన హరికేన్ (పెద్ద తుపాను) గురించే తెలుసు. అయితే అప్సరను కలిసిన తర్వాత ఒరిస్సా అన్ని రకాల హరికేన్లను సృష్టించగలదని తెలుసుకున్నాను. ఒరిస్సాలో ఇలాంటి బ్యూటీస్ ఉంటారని ఈమెను చూసిన తర్వాత తెలిసింది."

"థ్రిల్లర్" అనే సినిమాతో అప్సరను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు వర్మ. ఈమెను పరిచయం చేస్తూ ఆమెకు సంబంధించి ఫొటోల్ని వరుసగా రివీల్ చేస్తున్నాడు. ఆ ఫొటోలు చూస్తే వర్మ ఎందుకు అప్సరను కోరుకున్నాడో ఇట్టే అర్థమైపోతుంది ఎవరికైనా.