పాలు తాగుతున్నా ఇపుడు: ఆర్జీవీ

RGV, Ram Gopal Varma, Vodka, Milk, RGV Tweets
Tuesday, January 2, 2018 - 19:45

రామూ రాముడిగా మారిపోయాడు (రాంగోపాల్ వ‌ర్మ‌ని బాలీవుడు రామూ అని పిలుస్తుంటుంది లెండి). ఆ రామూ అలియాస్‌ ఆర్జీవీ  ఇపుడు వోడ్కా పుచ్చుకోవ‌డం లేద‌ట‌.  వోడ్కా తాగ‌డం మానేసి, ఇపుడు పాలు తాగుతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే బ‌య‌ట‌పెట్టాడు.

ఇంత‌కీ ఏ పాలు తీసుకుంటున్నాడు ? ఆ డౌట్ కూడా తీర్చేశాడు. కొబ్బ‌రి పాలు తీసుకుంటున్నా అని ఆయ‌నే ట్వీటాడు. ఏడు నెల‌ల త‌ర్వాత ఆయ‌న మ‌ళ్లీ ట్విట్ట‌ర్లోకి వ‌చ్చాడు. ఇన్నాళ్ల అజ్ఞాత‌వాసం తీరింద‌ట‌. ఇపుడు మ‌ళ్లీ ట్వీట్లతో రెచ్చిపోనున్నాడు.