'ఆర్జీవీ'... రోజూ గిల్లే వాడు!

RGV Roju Gille Vaadu title logo
Wednesday, April 1, 2020 - 14:15

రామ్ గోపాల్ వర్మకి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకి అస్సలు పడదు. వారిద్దరూ ఒకరిపై ఒక టీవీ ఛానల్ లో తిట్టుకున్నారు. ఆ తర్వాత వర్మ ... జొన్నవిత్తులని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. దాంతో కసిగా జొన్నవిత్తుల... వర్మపై ఒక సెటైరికల్ మూవీ తీస్తున్నారు. 

 బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న  'ఆర్జీవీ' చిత్ర టైటిల్ లోగోని శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని  రిలీజ్ చేశారు.  ఈ మూవీకి "RGV రోజూ గిల్లే వాడు" అనే పేరు ఖరారు అయింది. 

"తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా. అందుకే "శ్రీరామనవమి" పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగింద,"ని తెలిపారు జొన్నవిత్తుల. 

"కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాం.  సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు నిర్మాతల్లో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం.