పోర్న్ కోసమే వెబ్ లోకి వచ్చా

RGV says he glued to web for porn content
Friday, July 24, 2020 - 16:15

ప్రస్తుతం డిజిటల్ స్పేస్ లో ఇరగదీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. చకచకా ఓ 10 సీన్లు రాసేసి, తనకు తెలిసిన కెమెరా యాంగిల్స్ పెట్టేసి, సినిమా చుట్టేసి డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం డిజిటల్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్న యాక్టివ్ మేకర్ వర్మ ఒక్కడే. అయితే తనకు ఈ డిజిటల్ టెక్నాలజీ గురించి అస్సలు తెలియదంటున్నాడు వర్మ. తను ఇందులోకి రావడానికి కారణం పోర్న్ అని చెబుతున్నాడు.

"నిరక్షరాస్యులు చాలామంది ఉంటారు. అది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అవ్వొచ్చు. నేను కూడా అవ్వొచ్చు. ఎందుకంటే నాక్కూడా పూర్తిగా టెక్నాలజీ గురించి తెలియదు. నాకు మంచి టెక్నీషియన్ అనే పేరుంది కానీ టెక్నాలజీలో నాకు జీరో నాలెడ్జ్. నిజానికి నేను డిజిటల్ స్పేస్ కు వచ్చింది పోర్న్ చూడ్డానికి మాత్రమే. పోర్న్ లేకపోతే నాకు డిజిటల్ తో సంబంధమే లేదు."

ఇలా మరోసారి తనకున్న పోర్న్ చూసే అలవాటును బయటపెట్టుకున్నాడు ఆర్జీవీ. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అందులో ఈ విషయం చెప్పుకున్నాడు. అయితే ఈ వీడియో ఉద్దేశం మాత్రం అది కాదు.

రేపు రిలీజ్ అవ్వబోతున్న" పవర్ స్టార్" సినిమాను చూడాలనుకునే నిరక్షరాస్యుల కోసం ఈ వీడియో తయారుచేశాడు వర్మ. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, సినిమా ఎలా చూడాలనే టెక్నికల్ అంశాల్ని వివరించాడు. ఇన్ని చెప్పిన ఆర్జీవీ, తనకు కూడా డిజిటల్ లో సినిమా చూడడం రాదని, తన అసిస్టెంట్ డైరక్టర్లను అడిగి "పవర్ స్టార్" సినిమాను ఓపెన్ చేసుకొని చూస్తానని కబుర్లు చెబుతున్నాడు.