లవ్.. సెక్స్.. వర్మ

RGV talks about love, sex and more
Wednesday, June 3, 2020 - 17:45

ఏదైనా విషయంపై బోల్డ్ గా మాట్లాడ్డం ఆర్జీవీ స్టయిల్. రోజూ పొద్దున లేవగానే ఉత్సాహం కోసం పోర్న్ చూస్తానని గతంలో ఓసారి తనుకుతానే ప్రకటించుకున్న ఈ దర్శకుడు.. తాజాగా ప్రేమ-శృంగారం మధ్య తేడా చెబుతున్నాడు. సెక్స్ చేయడానికి లవ్ అనే పదం వాడుకుంటారంటున్నాడు వర్మ.

- అబ్బాయిలు, అమ్మాయిలు సెక్స్ అనే పదం వాడ్డానికి ఇష్టపడరు. ఎందుకంటే లవ్ కంటే సెక్స్ అనే పదం వాడితే చీప్ అయిపోతారు. అందుకని ప్రారంభంలో లవ్ అని చెబుతారు. ఎప్పుడైతే సెక్స్ చేసేస్తారో అప్పుడు అసలు రంగులు బయటపడతాయి. అందుకే లవ్ ను నేను నమ్మను. సెక్స్ ను నమ్ముతాను.

- కుక్కల మీద, చిన్న పిల్లల మీద లవ్ ఉంటుంది. ఎందుకంటే అవి ఎదురుతిరగవు. ఆపోజిట్ మైండ్ కూడా స్ట్రాంగ్ అయితే లవ్ చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే భిన్నాభిప్రాయాలుంటాయి. మూడ్స్ కూడా మారిపోతాయి. లవ్ అనేది యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది.

- నువ్వే గొప్పోడిని, నువ్వు లేకపోతే నేను లేను అన్నప్పుడే లవ్ ఉంటుంది. లేకపోతే ఉండదు. నువ్వు లేకపోతే జీవించలేను అంటూ ఓ వ్యక్తి సెక్స్ చేయకముందు అంటాడేమో కానీ ఆ తర్వాత అంతే ఇంటెన్షన్ తో అనలేడు. ఇదంతా నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను.