"పవర్ స్టార్" పవన్ కి అనుకూలమే

RGV's Powerstar to show Pawan Kalyan positively
Tuesday, July 7, 2020 - 10:30

వర్మ తీస్తున్న "పవర్ స్టార్" సినిమా... పవన్ కల్యాణ్ కి వ్యతిరేకం కాదట. ఆలా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రలో నటించేందుకు.... టిక్ టాక్ లు చేసుకునే పవన్ కళ్యాణ్ అభిమానిని ఒకరిని సెలెక్ట్ చేశాడు వర్మ. అతను ...తన డ్రెస్సింగ్, స్టైల్స్ తో అచ్చంగా పవన్ కళ్యాణ్ లా కనిపిస్తాడు. అందుకే వర్మ ఇతనిపై పడింది. ఐతే అతను పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్. అందుకే తమ అభిమాన హీరోకి వ్యతిరేకంగా తీసే సినిమాలో నటించేందుకు సంశయిస్తున్న టైములో వర్మ డైరెక్ట్ గా అతని వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి ఇరుకున పెట్టాడు. 

అసలు కథ ఏంటి అని ఆరా తీస్తే... ఇది పవన్ కల్యాణ్ ని పాజిటివ్ గా చూపిస్తుంది అని చెప్పాడట వర్మ. "పవర్ స్టార్" మూవీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూపిస్తుంది అనీ,  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకం అవుతాడు అన్నట్లు గానే ఎండ్ చేస్తాను అని చెప్పాడట వర్మ. అంటే క్లైమాక్స్ లో పాజిటివ్ గా చూపించి... సినిమా మొత్తం పవర్ స్టార్ ని ఆడుకుంటాడు అన్నమాట.

షకీలా సినిమాల్లో ముందు అంతా మసాలా సీన్లు చూపించి...చివర్లో మంచి మెసేజ్ ని పెట్టినట్లు ... వర్మ కూడా పవన్ కల్యాణ్ ని పూర్తిగా నెగటివ్ గా చూపించి చివర్లో 2024 లో సీఎం అవుతాడు అని ఎండ్ చేస్తాడన్నమాట.