కరోనా కోసం ఆర్జీవీ ప్రార్థన

RGV's tweet about Big B's corona positive news
Sunday, July 12, 2020 - 16:30

తనదైన స్టయిల్ లో తింగరి ట్వీట్లు పెట్టడంలో వర్మ పండిపోయాడు. సందర్భం ఏదైనా వర్మ సెటైర్లు మాత్రం ఆగవు. తాజాగా అమితాబ్ కు కరోనా సోకిన ఘటనపై కూడా వర్మ సెటైరిక్ గా స్పందించాడు. బిగ్ బితో సర్కార్ లాంటి హిట్ సినిమా తీసిన ఆర్జీవీ.. కరోనా గురించి ప్రార్థిస్తానంటున్నాడు.

కరోనాను వెనక నుంచి ఒక తన్ను తన్ని మరీ అమితాబ్ రెట్టించిన ఉత్సాహంతో, బలంతో తిరిగొస్తారని ట్వీట్ చేసిన వర్మ.. ఈ క్రమంలో అమితాబ్ కోసం తను ప్రార్థించనని, కరోనాతో బిగ్ బి జరుపుతున్న ఈ పోరులో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న కరోనా కోసం ప్రార్థిస్తానని ట్వీట్ చేశాడు.

ఇలాంటి సెన్సిటివ్ విషయంలో కూడా ఆర్జీవీ తన క్రియేటివిటీ చూపించడంతో అతడి డైహార్డ్ ఫ్యాన్స్ పొంగిపోవచ్చేమో కానీ.. నెటిజన్లంతా వర్మను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు 4 సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.