అరెస్ట్ ఖాయమని రియా భయమా?

Rhea Chakraborty's moves to Supreme Court
Wednesday, July 29, 2020 - 20:45

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రబోర్తి "లీలలు" బయటపడుతున్నాయి. సుశాంత్ తండ్రి రియాపై కేసు పెట్టడంతో... అందరి చూపు రియా చక్రవర్తి వైపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. రియాను ఏ నిమిషంలోనైనా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నిన్న, ఈ రోజు వార్తలు మార్మోగాయి. అయితే రియా అరెస్ట్ చెయ్యలేదు. ఆమె ఇప్పుడు తన లాయర్ సహాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

రియా విషయంలో కొన్ని తీవ్రమైన ఆరోపణలున్నాయి.

సరిగ్గా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సుశాంత్ ఫ్లాట్ ను రియా ఖాళీ చేసింది. ఆ ఖాళీ చేసే క్రమంలోనే ఖరీదైన వస్తువుల్ని తన వెంట తీసుకెళ్లింది. అక్కడితో మేటర్ అయిపోలేదు. సుశాంత్ ఎకౌంట్ నుంచి ఏకంగా రియాకు 15 కోట్ల రూపాయలు ట్రాన్సఫర్ అయ్యాయి. సరిగ్గా ఈ పాయింట్ మీదే సుశాంత్ తండ్రి కేకే సింగ్, రియాపై ఫిర్యాదు చేశాడు.

పాట్నా పోలీసులకు ఫిర్యాదుచేసిన కేకే సింగ్.. సరిగ్గా తన కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి 6 రోజుల ముందు రియా ఎకౌంట్ లోకి 15 కోట్ల రూపాయల డబ్బు జమ అయిందని ఆరోపించాడు. ఈ విషయాన్ని పాట్నా పోలీసులు కూడా గుర్తించారు. దీంతో పాటు సుశాంత్ ఫ్లాట్ నుంచి ఖరీదైన నగలు, వజ్రాలు కూడా రియా తీసుకెళ్లిపోయిందని కేకే సింగ్ ఆరోపించారు.

అలాగే... తలుపు పెట్టి అతన్ని బంధించింది అని అంటున్నారు. ఏడాది క్రితం సుశాంత్ కి డెంగ్యూ  వచ్చింది అని ఇంతకుముందు రియా చెప్పింది. కానీ అది అబద్దమని సుశాంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫిబ్రవరిలోనే... వారికి రియాపై అనుమానం వచ్చిందిట ఇంకా కొన్ని ఆరోపణలున్నాయి. అందుకే. రియా అరెస్ట్ తప్పదంట.

రియా లాయర్ మాత్రం ఈ అభియోగాలపై స్పందించలేదు. పాట్నా పోలీసులు నమోదు చేసిన కేసును, ముంబయి పోలీసులకు అప్పగించాలని మాత్రమే వారు సుప్రీంకోర్టును కోరారు.