నన్ను రేప్ చేసి, చంపేస్తారా: రియా

Rheya Chakrabory responds on cyberbullying
Thursday, July 16, 2020 - 13:15

"నన్ను మాయలేడి అన్నారు... ఊరుకున్నా
నన్ను హంతకి అని నిందలు మోపారు.... భరించా
నన్ను వ్యభిచారి అని చిత్రీకరించారు ... సహించా

కానీ ... నేను ఆత్మహత్య చేసుకోకపోతే నన్ను రేప్ చేసి, చంపి పాతరేస్తామని బెదిరించడమేంటి? నా మౌనం మీకు బలాన్నిచ్చిందా? మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? ఇలాంటి రాతలు, బెదిరింపులు నేరమని తెలుసా?"

ఇలాంటి వేధింపులు ఎవరూ గురి కావొద్దు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దు. దయచేసి సైబర్ పోలీసులు వీళ్లపై చర్య తీసుకొండి.

ఇది రియా చక్రబోర్తి వేదన. సుశాంత్ సింగ్ రాజపుత్ గాళ్ ఫ్రెండ్. సుశాంత్ మరణానానికి ముందు ఆమె అతనితో బ్రేకప్ చేసుకొందట. వాళ్లిద్దరూ ఎందుకు  బ్రేకప్ చెప్పుకున్నారో మనకి తెలియదు. కానీ ఆమె వల్లే సుశాంత్ చనిపోయాడంటూ పాపం రియాని సోషల్ మీడియాలో నెల రోజులుగా వేధిస్తున్నారు. సుశాంత్ చనిపోయిన 30వ రోజు ఆమె స్పందించింది. సుశాంత్ ని ఎప్పటికి మరిచిపోలేను అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. కొన్ని ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసింది.

ALSO READL సుశాంత్ కేసు 'క్లోజింగ్' కొచ్చిందా?

Sushant and Rhea

ఐతే, నువ్వు కూడా చచ్చిపో... సూసైడ్ చేసుకో... అంతో సుశాంత్ అభిమానులు కొందరు ఆమెని ఇంస్టాగ్రామ్ లో వేధిస్తున్నారు. 

అలియా భట్ ని కూడా రేప్ చేస్తామంటూ ఇలాంటి మెసేజ్ లు పెడుతున్నారు. ఇవి శ్రుతి మించుతున్నాయి. సుశాంత్ మరణం ఒక బాధాకరమైన ఘటనే. నేపాటిజమ్ బాధితుడు అనడంలో సందేహం లేదు. కానీ అలియా, రియా వంటి వారిని ఇలా బెదిరించడం తప్పు అని సుశాంత్ అభిమానులు తెలుసుకోవాలి. మీ అభిమానం ఇంకొకరికి శాపం కాకూడదు. 

ALSO READ: ఆలియాతో రాజమౌళికి టెన్షనే!

|

Error

The website encountered an unexpected error. Please try again later.