ప్రపంచంలోనే ఈ పాట పెద్ద హిట్

Rowdy Baby song becomes worlds biggest hit?
Saturday, December 7, 2019 - 19:00

ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మారి2. ఈ సినిమా సంగతి పక్కనపెడితే, ఇందులో ఓ సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయింది. అదే రౌడీ బేబీ. సాంగ్ కంపోజిషన్ తో పాటు, కొరియోగ్రఫీ అదిరిపోవడంతో యూట్యూబ్ లో భయంకరంగా హిట్స్ వచ్చాయి. అలా ఇండియాలో అత్యధిక మంది వీక్షకులు చూసిన వీడియోగా రౌడీ బేబీ హిట్ కొట్టగా.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ కూడా బయటపెట్టింది యూట్యూబ్.

ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన వీడియో సాంగ్స్ లో కూడా రౌడీ బేబీ చోటు దక్కించుకుంది. వరల్డ్ వైడ్ హిట్ అయిన టాప్-10 సాంగ్స్ లో ఈ పాటకు కూడా చోటు దక్కింది. ఏకంగా 725 మిలియన్ వ్యూస్ తో ఈ పాట వరల్డ్ టాప్-10లో 7వ స్థానంలో నిలిచినట్టు యూట్యూబ్ ప్రకటించింది. దీంతో మారి2 యూనిట్ మరోసారి పండగ చేసుకుంటోంది. అంతేకాదు.. ఈ సందర్భంగా ఈ పాట మరోసారి కోలీవుడ్ లో ట్రెండింగ్ గా మారింది.

ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా రాశాడు. అతడే స్వయంగా పాడాడు కూడా. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటకు ప్రభుదేవా బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేశాడు. అయితే ఈ పాటకు ఇలా ఎన్ని కుదిరినప్పటికీ, ఎక్కువమంది వీక్షకులు మాత్రం సాయిపల్లవి స్టెప్స్ కోసమే ఈ వీడియో చూశారు. ఇది మాత్రం నిజం.