చరమాంకంలోకి ఆర్.ఆర్.ఆర్

RRR enters into final stage of shooting
Thursday, January 23, 2020 - 11:00

రాజమౌళి  తీస్తున్న "ఆర్.ఆర్.ఆర్" షూటింగ్ ఇక చివరి దశకి చేరుకున్నట్లే. అజయ్ దేవగన్ షూటింగ్ కి రావడంతో సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ ప్రకారమే వెళ్తోంది అని అర్థం అవుతోంది. ఇక అలియా భట్ కూడా వస్తే.. సినిమా ఎండింగ్ కి వచ్చినట్లు అవుతుంది. 

త్వరలోనే 40 రోజుల నాన్ స్టాప్ షెడ్యూల్ రెడీ చేస్తున్నారు రాజమౌళి. ఆ షెడ్యూలుతో గుమ్మడికాయ కొడుతారు. దాన్ని బట్టి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ కొత్త సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ షెడ్యూల్ వచ్చేనెల మొదలవుద్దా? మార్చిలోనా అనేది ఇంకా తేలాలి. 

దాదాపు 350 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు.