వాయిదా వేయకతప్పట్లేదు

RRR is getting postponed
Sunday, January 19, 2020 - 23:15

మొన్నటివరకు తమ సినిమా వాయిదా లేదు అని రామ్ చరణ్ ఘంటాపథంగా చెప్పాడు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం సినిమా వాయిదాకు ఓటేశారు.  ఈ ఏడాది జులైలో రిలీజ్ కావాల్సిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా అక్టోబర్ కి వెళ్తోంది. అధికారికంగా రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తారు. షూటింగ్ లో జాప్యం మెయిన్ రీజన్. అలాగే గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావనే ఉద్దేశంతో డేట్ ని మారుస్తున్నారు. 

మెయిన్ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఐతే, అజయ్ దేవగన్, అలియా భట్ కి చెందిన స్కీన్లు ఇంకా తీయాలి. అలాగే పాటలు పూర్తి చెయ్యాలి. పాటలు లేకుండా సినిమా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఉంది. కానీ పాటల్లేని వర్షన్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో రిలీజ్ చేస్తారేమో. తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషల్లో పాటలు ఉంచక తప్పదు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి సంబదించిన మొత్తం షూటింగ్ పార్ట్ మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఈ హీరోలు ఇద్దరు వేరే సినిమాలు మొదలు పెడుతారు. చరణ్ కొరటాల శివ డైరెక్షన్ లో తన తండ్రి హీరోగా తీస్తున్న సినిమాలో నటిస్తాడు. ఏన్టీఆర్ ...త్రివిక్రమ్ సినిమా మొదలు పెడుతాడు.