RRR రిలీజ్ కి ఎన్నో చిక్కులు

RRR has many tangles for its release
Monday, May 18, 2020 - 19:00

"నా కెరీర్ లో చాలా టఫ్ మూవీ షూటింగ్ ఇదే," అని రాజమౌళి మొన్న ఆ మధ్య అన్నప్పుడు ఆశ్చర్యపోయాము. "బాహుబలి" షూటింగ్ కన్నా "ఆర్.ఆర్.ఆర్" కష్టమా అనిపించింది. కానీ చూస్తుంటే అదే వాస్తవంగా మారుతోంది. 

ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇక ఎన్ని చెప్పినా నమ్మేలా లేరు డిస్ట్రిబ్యూటర్లు. అసలు ఈ సినిమాని ఇకపై భారీ రేట్లకి అమ్మగలరా అన్నది కూడా డౌటే. లాక్డౌన్ తర్వాత మార్కెట్ ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు. ఆర్థిక స్థితి మెరుగుపడకపోతే బాహుబలి 2 రేంజ్ రేట్లు అనేది మర్చిపోవాలి. 

అమెరికా, ఓవర్ సీస్ మార్కెట్ కోసం ఇప్పటికే ఈ సినిమాని 65 కోట్ల రూపాయలకి అమ్మేశారు. అమెరికాలో కూడా కరోనా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రిసెషన్ కనిపిస్తోంది. సో... ఇప్పటికిప్పుడు రాజమౌళి ఈ సినిమాని రిలీజ్ చెయ్యడు. సంక్రాంతి 2021కి విడుదల కాదు. 2021 సమ్మర్ కైనా వస్తుందా? అప్పటికి ఆర్థిక మందగమనం లేకపోతే రావొచ్చు లేదంటే మరింత లేట్ అవుతుంది. 

"ఆర్.ఆర్.ఆర్" విడుదలకి ఇన్ని చిక్కులున్నాయి. 

ఇక ఎన్టీఆర్ బర్త్ డే కి టీజర్ రిలీజ్ చెయ్యడం కుదరలేదు. నిజంగా ఇప్పుడు రిలీజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే రిలీజ్ మరింత వాయిదా పడితే... ఇది స్టీల్ అవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ బర్త్ డే కి రిలీజ్ చేసిన టీజర్ ని అందరూ మర్చిపోయారు. దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. దానికి వచ్చిన యూట్యూబ్ వ్యూస్ కూడా తక్కువ. ఎందుకంటే అందరూ కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ తో లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు. అందుకే ఆ టీజర్ కి రావాల్సినంత వ్యూస్, హైప్ రాలేదు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.