ఆర్.ఆర్.ఆర్‌లో అంతా మూడులోనే

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా ఎపిక్....ఆర్.ఆర్.ఆర్
ఈ సినిమా టైటిల్‌లో మూడు Rలున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి..ముగ్గురు మెయిన్ పిల్లర్స్. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త పుకారు షురూ అయింది. ఈ సినిమాలో పాటలు కూడా మూడే ఉంటాయిట. ఇది ఇంతవరకు నిజమో కానీ ఈ వార్త మాత్రం ఆసక్తికరంగానే ఉంది.
సినిమాల్లో పాటల కన్నా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ పెట్టాలనేది రాజమౌళి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. పాటలను తగ్గిస్తూ వస్తున్నారు. ఇపుడు ఏకంగా మూడు పాటల మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్ డ్యాన్సర్స్. మరి ఇద్దరికీ చెరో రెండు పాటలు కూడా లేకపోతే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? నిజంగా మూడు పాటలతోనే రాజమౌళి సరిపెడుతాడా అనేది చూడాలి.
ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకొంది. రీసెంట్‌గా ఎన్టీఆర్‌పై బల్గేరియాలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఇపుడు కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానుంది.
- Log in to post comments