RRR: 10 భాషల్లో 2020లో విడుదల

RRR to release in 10 languages
Wednesday, November 20, 2019 - 18:45

రాజమౌళి తీస్తున్న RRR షూటింగ్ ఇప్ప‌టికే 70 శాతం పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా జక్కన్న తీస్తున్న ఈ మూవీ జులై 30, 2020న వస్తుందా అంటే చెప్పలేము. లేటెస్ట్ గా టీం విడుదల చేసిన ప్రెస్ నోట్లోనూ రిలీజ్ డేట్ లేదు. జస్ట్... 2020లో విడుదల అని పేర్కొన్నారు.

కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్ , ఆలియా భ‌ట్ కూడా న‌టిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ జోడిగా ఆలియా భ‌ట్ నటించనుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న బ్రిటీష్ న‌టి ఒలివియా మోరిస్‌ న‌టించ‌నున్నారు. అలిసన్ డూడీ, రే స్టీవెన్ స‌న్ మెయిన్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. `

10 భాష‌ల్లో  ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుందట. రాజమౌళి తన బాహుబలిని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. చైనీసు భాషల్లో కూడా అనువదించారు. ఇప్పుడు ఏకంగా జపాన్, కన్నడ, స్పానిష్, బెంగాలీ... తదితర లాంగ్వేజ్ ల్లో కూడా డబ్ చేస్తారని టాక్.