ఆర్.ఆర్.ఆర్: నాలుగు కోట్లు సౌండ్‌కే

Rs 4 Cr for sound design in RRR
Friday, March 15, 2019 - 17:45

"ఆర్.ఆర్.ఆర్" సినిమా బడ్జెట్ ఎంత? 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని నిర్మాత దానయ్య ఇటీవల జరిగిన సినిమా ప్రెస్ మీట్లో వెల్లడించారు. అంత బడ్జెట్టా అని అందరూ ఇప్పటికే అందరూ ఆరాతీయడం మొదలుపెట్టారు. అంత ఉండదు.. హైప్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ ఏముంటాయి? ఆయనే ఒక బ్రాండ్ ఇపుడు. ఎంత బడ్జెట్ అయినా.. సినిమాకి వ్యాపారం అంతే రేంజ్లో అవుతుంది కదా.

హాలీవుడ్ సినిమాల్లో సౌండ్ డిజైన్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వారి సినిమాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సారి తన సినిమాలోనూ ఆ పని చేద్దామనుకుంటున్నాడు రాజమౌళి.

"ఆర్.ఆర్.ఆర్" సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు సౌండ్ డిజైన్‌కే బడ్జెట్ కేటాయించారట. ఇందులో నిజమెంతో కానీ..సౌండ్ మీద రాజమౌళి ఎక్కువ దృష్టి పెడుతున్నారనేది నిజం.

"ఆర్‌.ఆర్‌.ఆర్" సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లోనూ, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజు పాత్ర‌లోనూ న‌టించ‌నున్నారు. ఆలియా భ‌ట్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించ‌నుంది. అజ‌య్‌దేవ‌గ‌న్ ఒక కీల‌క పాత్ర పోషిస్తారు.