చిల‌సౌ సుంద‌రి బ‌యట బాగుంది

Ruhani Sharma looks beautiful off screen
Monday, August 6, 2018 - 15:15

"చిల‌సౌ" సినిమాలో సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయిగా న‌టించింది రుహానీ శ‌ర్మ‌. అంతేకాదు, మేక‌ప్‌తో ఆమెకి మొటిమ‌లున్న‌ట్లు చూపించారు. సినిమాలో చాలా వ‌ర‌కు మొటిమ‌ల‌తోనే క‌నిపిస్తుంది. చివ‌ర్లో మాత్రం మొటిమ‌లు మాయం అవుతాయి. "చిల‌సౌ" సినిమా యావరేజ్‌గానే ఉన్నా...సినిమాలో ఈ అమ్మ‌డి న‌ట‌న మెప్పించింది.

ఐతే ఈ అమ్మ‌డు అందెగ‌త్తెనే అని చెప్పొచ్చు. ఆఫ్ స్క్రీన్‌లో ఆమె స్ట‌న్నింగ్‌గా ఉంది. ప్రెస్‌మీట్స్‌కి వ‌చ్చిన‌పుడు చూస్తే ఆమె ఎటువంటి మొటిమ‌లు లేకుండా య‌మా బ్యూటీఫుల్‌గా ఉంది. మ‌రి ఇటు అందం, అటు అభిన‌యం ఉన్న ఈ శ‌ర్మ సుంద‌రికి మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయా?