కొత్త రూమర్: క్రికెటర్ తో అనుష్క పెళ్ళి

Rumors about Anushka's wedding with a cricketer surface
Tuesday, February 11, 2020 - 13:15

అనుష్క షెట్టి పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చాయో! ఎవరైనా లెక్క పెట్టారా? ఆ ప్రచారం అంతా అబద్దమే అని ప్రూవ్ అయినా కూడా కొత్త పుకార్లు పుడుతూనే ఉన్నాయి.  అనుష్క పెళ్లి అనేది ఇంగ్లీష్ మీడియాకి ముఖ్యంగా బాలీవుడ్ న్యూస్ పేపర్లకి ఒక పిచ్చిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త ప్రచారం తీసుకొస్తున్నాయి. 

లేటెస్ట్ పుకారు ఏంటంటే. ... అనుష్క ఒక క్రికెటర్ ని పెళ్లాడనుందట. ఇంతకీ ఎవరా క్రికెటర్? ఆ మీడియా మాటల్లో చెప్పాలంటే... "నార్త్ ఇండియా కి చెందిన క్రికెటర్ ఇతను. కాకపోతే దక్షిణాది రంజీల్లోనూ, ఐపీఎల్ ల్లో ఆడుతుంటాడట."

ఇందులో నిజమెంతో? మొన్నటి వరకు ప్రభాస్, అనుష్క పెళ్లి అని తెగ రాసేశారు. అనుష్క ఎప్పటిలాగే మౌనంగా ఉంది. తన సోషల్ మీడియా లో తన కుక్క పిల్లతో కూడిన ఫోటోలని రెగ్యులర్ గా షేర్ చేస్తోంది.