ఇది పక్కా పుకారు

పవర్ స్టార్ ఓ సినిమా చేస్తున్నాడంటే చాలు లీకేజీలతో పాటు ప్యాకేజీలా పుకార్లు కూడా వెన్నంటే ఉంటాయి. రీఎంట్రీలో కూడా ఈ స్పెషల్ ప్యాకేజీ పవన్ ను వెంటాడుతూనే ఉన్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న పింక్ సినిమా లీకేజీలతో ఇబ్బంది పడుతుంటే.. దీనితో పాటు చేయాల్సిన క్రిష్ సినిమా రూమర్లతో ఇబ్బంది పడుతోంది.
అవును.. క్రిష్ సినిమాలో హీరోయిన్ అంటూ రోజుకొక పుకారు షికారు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రగ్యా జైశ్వాల్ పేరు తెరపైకి వచ్చింది. పవన్ సరసన ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారంటూ వరుసగా కథనాలు వస్తున్నాయి. నిజానికి పవన్ సినిమా అంటే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లంతా అతడి సరసన నటించడానికి రెడీ. అలాంటప్పుడు ఏరికోరి ఫ్లాప్ హీరోయిన్ ప్రగ్యాను ఎందుకు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా బడ్జెట్ సమస్యలు కూడా లేవు కదా.
ఈ పుకారు రావడానికి ప్రధానంగా ఒకటే కారణం కనిపిస్తోంది. గతంలో క్రిష్ తీసిన ఓ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇంకా చెప్పాలంటే ఆమెను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసింది క్రిష్షే. అందుకే ఈ పుకారు వచ్చి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
- Log in to post comments