చిత్ర‌ల‌హ‌రితో ప‌రుగు స‌క్సెస్ పెట్టేనా?

Sai Dharam Tej pins hopes on Chitralahari
Monday, March 18, 2019 - 18:45

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఫ్లాప్‌లు ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఇలా మరో యంగ్ హీరో ఎవరైనా ఇన్ని ఫ్లాప్‌లు ఇస్తే ఒక్క నిర్మాత, దర్శకుడు కూడా సాయి ధరమ్ వైపు చూపు వేసేవారు. కానీ అతను మెగా కుటుంబానికి చెందిన హీరో. ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా.. అవకాశాలు వస్తాయి. అండ దండుగా ఉంటుంది.

ఇపుడు "చిత్రలహరి" సినిమాతో మన ముందుకొస్తున్నాడు సాయి ధరమ్ తేజ. గడ్డం ఫుల్లుగా పెంచుకొని ఈ సినిమాలో నటించాడు. ఇటీవల విడుదలైన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు.

"చిత్రలహరిష‌ సినిమాకి దర్శకుడు కిషోర్ తిరుమల. "నేను శైలజ" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల ఆ తర్వాత "ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. "ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమా టీజర్లకి, ట్రయిలర్లకి, పాటలకి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా చతికిలాపడింది.

మరి సాయిధరమ్ తేజ సక్సెస్ పరుగు అందుకుంటాడా? ట్రయిలర్ కి వచ్చిన రెస్పాన్స్ సినిమా తర్వాత కూడా ఉంటే అందుకోగలడు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.