సుప్రీం హీరో మనసులో మాటలివి!

Sai Dharam Tej talks about villain character
Wednesday, January 1, 2020 - 23:15

ప్రతి రోజూ పండగే సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు సాయితేజ్. న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. పనిలోపనిగా తన మనసులో ఉన్న ఆలోచనలు, భావాల్ని షేర్ చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా విలన్ పాత్రపై సాయితేజ్ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

సాయితేజ్ కు విలన్ పాత్ర పోషించాలని ఉందట. కాకపోతే అది సిల్వర్ స్క్రీన్ పై మాత్రం కాదు. వెండితెరపై హీరోగా కనిపిస్తూనే.. ఏదైనా వెబ్ సిరీస్ లో విలన్ గా నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు సాయితేజ్. గ్రే షేడ్స్ తో ఉన్న మంచి క్యారెక్టర్ వస్తే మిస్ చేసుకోనంటున్నాడు.

మరోవైపు మల్టీస్టారర్స్, రీమేక్స్, అప్ కమింగ్ మూవీస్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేయాల్సి వస్తే అది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితేనే చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. చిరంజీవి నటించిన సినిమాల్ని ఎట్టిపరిస్థితుల్లో రీమేక్ చేయనని, తప్పనిసరి పరిస్థితుల్లో రీమేక్ చేయాల్సి వస్తే చంటబ్బాయ్ సినిమాను రీమేక్ చేస్తానంటున్నాడు. ప్రస్తుతం సోలో బతుకే సో బెటర్ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. 3వ తేదీ నుంచి ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలవుతుంది.