వెబ్ లో కూడా ఫిదా చేస్తుందట

Sai Pallavi's digital debut
Wednesday, July 29, 2020 - 14:45

కొన్ని మంచి మంచి పాత్రలు సినిమాల్లో దొరకవు. వెబ్ సిరీస్ లు, ఒరిజినల్ కంటెంట్ రూపంలో అలాంటివి అందుబాటులోకి వస్తుంటాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న చాలామంది నటీనటులు అలాంటి పాత్రలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. మరీ ముఖ్యంగా లైమ్ లైట్లో ఉన్నోళ్లు అస్సలు చూడరు. కానీ సాయిపల్లవి మాత్రం అలాంటి ఓ పాత్రకు ఓకే చెప్పింది.

అవును.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతోంది సాయిపల్లవి. వెట్రిమారన్ డైరక్ట్ చేయబోయే ఈ సిరీస్ మొత్తం సాయి పల్లవి చుట్టూ తిరుగుతుంది. మరో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరూ సిరీస్ లో తండ్రికూతుళ్లుగా కనిపిస్తారు. తమిళనాట ఉన్న సామాజిక అంశాలు, ప్రస్తుతం ఉన్న సమస్యల్ని స్పృశిస్తూ ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. వీటిలో పరువు హత్య అంశం కూడా ఒకటి.

ప్రస్తుతం సాయిపల్లవి చేస్తున్న 2 తెలుగు సినిమాలు ఫైనల్ స్టేజ్ లో ఆగిపోయాయి. వీటిలో ఒకటి 'లవ్ స్టోరీ' కాగా.. ఇంకోటి 'విరాటపర్వం'. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఆమె చేయబోయే వెబ్ సిరీస్ పై క్లారిటీ వస్తుంది.