నాకు ఎలాంటి రోగాల్లేవు: సాయి తేజ్

Sai Tej: i don't have any disorders
Tuesday, November 19, 2019 - 08:45

తనకు ఎలాంటి ఆరోగ్య, మానసిక సమస్యలు లేవంటున్నాడు హీరో సాయితేజ్. ఇప్పటికిప్పుడు తన ఆరోగ్య పరిస్థితిపై సాయితేజ్ ఇలా ఓపెన్ గా రియాక్ట్ అవ్వడానికి ఓ రీజన్ ఉంది. దానికి కారణం మారుతి. అవును.. మారుతి సినిమాల్లో హీరోలకు ఏదో ఒక వీక్ నెస్ ఉంటుంది. అతిశుభ్రత, మతిమరుపు లాంటి రోగాల్ని హీరోలకు ఆపాదించాడు ఈ హీరో. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయితేజ్ ఇలా ముందుజాగ్రత్తగా ఈ ప్రకటన చేశాడు.

"మీరు (జర్నలిస్టులు)  ఎక్కువగా ఆలోచించుకోవద్దు. నాకు ఈ సినిమాలో ఎలాంటి డిస్ ఆర్డర్ లేదు. మతిమరుపులాంటివేం నాకు లేవు. ప్రతి రోజూ పండగే  సినిమా ఓ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాలో నా పాత్రతో పాటు సినిమా మొత్తం మీకు బాగా నచ్చుతుంది."

ఇలా ప్రతిరోజూ పండగ సినిమాలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చాడు సాయితేజ్. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. అమెరికాలో ఉండే హీరో, కోనసీమలో ఉండే రాశిఖన్నాను చూసి ఇష్టపడి ఇండియాకు వస్తాడట. సినిమా ఈ లైన్లో సాగుతుందంటున్నారు. అయితే మెయిన్ పాయింట్ మాత్రం ఇది కాదు. 

ప్రతి మనిషి తనవాళ్ల పుట్టుకను ఎలా సెలబ్రేట్ చేస్తాడో, ఆ వ్యక్తి పోయినప్పుడు కూడా అతడికి అంతే గ్రాండ్ గా సెండాఫ్ ఇవ్వాలనే బలమైన, బరువైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీన్ని కాస్త ఎంటర్ టైనింగ్ గా చూపిస్తూ, సందేశం ఇచ్చామంటున్నాడు దర్శకుడు మారుతి.