ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని క‌ట్ చేసిన సాక్షి

Sakshi crops Pawan Kalyan's pic
Tuesday, October 24, 2017 - 17:45

త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే. అలాగే రాజ‌కీయాలు వేరు, సినిమా వేరు. రాజ‌కీయ‌ప‌రంగా వైరం ఉన్నా... సినిమాల పరంగా ఏ హీరోకి క‌వ‌రేజ్ విష‌యంలో తెలుగు మీడియా త‌క్కువ చేయ‌దు. కానీ తాజాగా సాక్షి చూపిన అల్పబుద్ది ఆ ప‌త్రిక స్థాయిని త‌గ్గించింది.

అస‌లు మేట‌ర్ ఏంటంటే..సాక్షి దిన‌ప‌త్రిక ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటోని త‌న సినిమా పేజీలో రాకుండా జాగ్ర‌త్త ప‌డింది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమా ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ప‌వ‌ర్‌స్టార్ ముహూర్త‌పు షాట్‌కి క్లాప్ కొట్టాడు. ఈ వార్త‌ని త‌న సినిమా పేజీలో క‌వ‌ర్ చేసింది సాక్షి. ఈ న్యూస్ ఐటెంకి సంబంధించి ఏకంగా మూడు ఫోటోల‌ను ప‌బ్లిష్ చేసింది. మూడు ఫోటోల్లో ఎక్క‌డా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌కుండా ఎడిట్ చేసింది ఆ ప‌త్రిక‌.

న్యూస్ యాంగిల్‌ని కూడా ఎన్టీఆర్ సినిమాలో అత‌ని కుమారుడు అభ‌య్ న‌టించే అవ‌కాశం ఉందేమో అన్న‌ట్లుగా రాసేసి, ఎన్టీఆర్ సినిమాకి ప‌వ‌ర్‌స్టార్ వ‌చ్చాడు అన్న మేట‌ర్‌ని క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ప‌వ‌ర్‌స్టార్‌కి ఇపుడు ఎక్కువ క‌వ‌రేజ్ ఇస్తే వైస్సార్సీ పార్టీ అధినేత జ‌గ‌న్‌కి ఇబ్బంది అని భావించిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రీ ఇది ఓవ‌ర్‌గా అనిపించ‌డం లేదూ!

ప‌వ‌ర్‌స్టార్ ఫోటో క‌ట్ చేసినంత‌ మాత్రానా జ‌గ‌న్‌కి ఒక ఓటు పెరుగుతుందా, సీటు వ‌స్తుందా?