ఆలియా - సల్మాన్ మూవీ అటకెక్కిందందుకే!

Salman Khan and Alia Bhatt film scrapped
Tuesday, August 27, 2019 (All day)

రాజమౌళి తీస్తున్న 'R.R.R' సినిమాలో నటిస్తున్న ఆలియా భట్... ఈ మూవీకి డేట్స్ ఎలా కేటాయించగలదో అన్న డౌట్స్ ఉండేవి. ఎందుకంటే ఆమె బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ వంటి మాస్టర్ డైరెక్టర్ల సినిమాల్లో నటిస్తోంది. వాళ్ళు రాజమౌళి లాగే పెర్ఫెక్షనిస్టు  బ్యాచే. ఓ పట్టానా హీరోయిన్ల డేట్స్ ని ఇతర సినిమాలకి ఇవ్వరు. అయితే, ఇప్పుడు రాజమౌళి టీం ఊపిరి పీల్చుకోవచ్చు. 

సల్మాన్ ఖాన్, అలియా హీరో హీరోయిన్లుగా భన్సాలీ అనౌన్స్ చేసిన 'ఇన్సల్లాః' సినిమా ఆగిపోయింది. సినిమా అటకెక్కింది. పారితోషికం విషయంలో సల్మాన్ తగ్గలేదు. దాంతో, భన్సాలీ సినిమాని పక్కన పెట్టాడట. భన్సాలీ, సల్మాన్ మధ్య ఇగో ఇష్యూల వల్లే ఇదంతా. నేను హీరోని కాబట్టి నాకే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి అనేది సల్మాన్ వాదన. ఈ సినిమాకి బిసినెస్ జరిగేది నా పేరు మీద కాబట్టి ... హీరో కన్నా నాకే పారితోషికం ఎక్కువ ఉండాలనేది దర్శకుడి ఆర్గుమెంట్. సల్మాన్ దానికి ఒప్పుకోలేదు. దాంతో భన్సాలీకి కోపమొచ్చి సినిమాని క్యాన్సల్ చేసాడు. 

ఇప్పుడు ఇదే కథని  షారుక్ ఖాన్ తో తీసే ఛాన్స్ ఉందట.