సల్మాన్ ముద్దూ ముచ్చట

Saman Khan talks about hygiene
Monday, April 13, 2020 - 15:30

ఈ కరోనా టైమ్ లో వ్యక్తిగత శుభ్రత గురించి అంతా చెబుతున్నారు. ప్రజలంతా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ  లెక్చర్లు ఇస్తున్నారు. ఇందులో కూడా తనదైన మార్క్ చూపించాడు సల్మాన్ ఖాన్. ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా కేవలం తన సినిమా క్లిప్స్ రెండింటిని బ్యాక్ టు బ్యాక్ చూపించి పరోక్షంగా, ఫన్నీగా మంచి సందేశాన్నిచ్చాడు.

మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ అద్దాన్ని ముద్దాడుతుంది. తర్వాత వచ్చిన సల్మాన్, ఆ లిప్ స్టిక్ ముద్రపై తన పెదవుల్ని ఆనించి ముద్దుపెడతాడు. కట్ చేస్తే.. ఈసారి కూడా గ్లాస్ డోర్ పై హీరోయిన్ లిప్ స్టిక్ ముద్ర కనిపిస్తుంది. అయితే ఈసారి సల్మాన్ మాత్రం తన పెదవుల్ని ఆ లిప్ స్టిక్ పై పెట్టి ముద్దుపెట్టడు. ముద్దుపై స్ప్రే కొట్టి దాన్ని శుభ్రం చేస్తాడు.

ఈ వీడియో పెట్టిన సల్మాన్ అంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలంటూ పరోక్షంగా సందేశం ఇచ్చాడు. కండలవీరుడు పెట్టిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.