కథ వినకపొతే బ్లాక్ బస్టర్

Samantha about her story selection
Thursday, February 6, 2020 - 20:30

కథల విషయంలో సమంతకు మంచి డెసిషన్ మేకింగ్ ఉందని నాగార్జున పదేపదే చెబుతుంటాడు. నాగచైతన్య కూడా అదే మాట అంటుంటాడు. అందుకే చైతూ సినిమాల్ని సమంత కూడా చూసి కరెక్షన్స్ చెబుతుందని కూడా గతంలో ఓ సందర్భంలో నాగ్ అన్నాడు. ఇదే విషయంపై సమంతను ప్రశ్నించింది మీడియా. దీనికి ఆమె గమ్మత్తైన సమాధానం ఇచ్చింది.

డెసిషన్ మేకింగ్ లో, స్టోరీ సెలక్షన్ లో తను చాలా వీక్ అంటోంది సమంత. కేవలం ఏదో ఒక పాయింట్ నచ్చితే సినిమా ఒప్పుకుంటున్నానని అంటోంది. దీనికి రంగస్థలం సినిమాను ఎగ్జాంపుల్ గా చెబుతోంది. రంగస్థలం సినిమా స్టోరీ సమంతకు అస్సలు తెలియదట. కేవలం తన క్యారెక్టర్ గురించి మాత్రమే చిన్నపాటి నెరేషన్ ఇచ్చారని, వెంటనే ఒప్పుకున్నానని అంటోంది. రంగస్థలం అంత పెద్ద హిట్టయిందంటే దానికి కారణం తన డెసిషన్ మేకింగ్ కాదని,  అది తన అదృష్టమని ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

అయితే మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాల విషయంలో మాత్రం తన నిర్ణయాలు సరైనవనే విషయం ప్రూవ్ అయిందంటోంది సమంత. మజిలీ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని స్టోరీ విన్నప్పుడే ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చింది. ఇక ఓ బేబీ విషయానికొస్తే.. ఆ సినిమా ఔట్ పుట్ పై చాలా సందేహాలున్నాయని, రిలీజ్ ముందు రోజు రాత్రి అస్సలు నిద్రపట్టలేదని, హిట్ టాక్ వచ్చిన తర్వాత పడుకున్నానని చెప్పింది.

ఇన్ని విషయాలు చెప్పిన సమంత.. జాను సినిమా హిట్టవుతుందా అవ్వదా అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మనసకు నచ్చడంతో జాను పాత్ర పోషించానని, రిజల్ట్ తన చేతిలో లేదని అంటోంది. రేపు థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.