నా డెలివరీ డేట్ ..ఆగస్టు 7: సమంత

Samantha reveals about her pregnancy
Wednesday, November 20, 2019 - 00:15

సమంత తల్లి కాబోతుందా? ఆమె ఇప్పుడు గర్భవతా?
ఇలాంటి హెడ్ లైన్స్ చాలా కాలంగా నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ఒక ప్రశ్నకి తాజాగా సమంత సమాధానమిచ్చింది. ఆగస్టు 7న నాకు డెలివరీ డేట్ ఇచ్చారు అంటూ రిప్లై ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది సమంత.

ఆమె నిజంగానే ఇప్పుడు గర్భవతా అన్న డౌట్ వస్తోందా? అసలు మేటర్ ఏంటంటే..... 

సమంత ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ షూటింగ్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న టైంలో కొంత తీరిక దొరకడంతో.. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో చాటింగ్ చేసింది. పలువురు అభిమానులు రకరకాల ప్రశ్నలు వేశారు. ఆమె వాటికి ఓపిగ్గా ఆన్సర్ ఇచ్చింది. ఒక ఫాలోవర్ ... తల్లి ఎప్పుడు కాబోతున్నావు అని అడిగాడు. దాంతో... ఆమె ఇచ్చిన రిప్లై చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. 

"నా బాడీ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవాలని తెగ ఆసక్తి చూపుతున్నవారికి నేను చెప్పేదేంటంటే.. నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా. డెలివరీ డేట్.. ఆగస్టు 7న 7 గంటలకి, 2022." ఇలా పోస్ట్ చేసింది. అది మేటర్. తన ప్రెగ్నన్సీ గురించి అడుగుతున్న వారికి ఇలా సెటైర్ వేసింది సమంత. 

నాగ చైతన్య, సమంత పెళ్లి ...రెండేళ్ల క్రితం జరిగింది. ఏడాది కాలంగా సమంత అమ్మ కాబోతోంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంతకి పిల్లలు అంటే చాలా ఇష్టం అనేది నిజమే కానీ... అదే పనిగా అదే విషయం అడుగుతున్నారు అని ఆమె చికాకు పడుతోంది.