నేను అలా చేస్తే చైతూ చంపేస్తాడు

Samantha reveals more secrets about her husband
Wednesday, February 12, 2020 - 14:30

సమంత-నాగచైతన్య ఫ్యామిలీ ముచ్చట్ల గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. తమ దాంపత్యానికి సంబంధించి ఎన్నో సీక్రెట్స్ ను స్వయంగా సమంత వెల్లడించిన సందర్భాలున్నాయి. ఎవరూ లేనప్పుడు చైతన్యను ఏమని పిలుస్తుందో కూడా ఓసారి చెప్పేసింది. అలాంటిదే మరో ముచ్చటను పంచుకుంది. తనకు సంబంధించి ఓ విషయం నాగచైతన్యకు ఇష్టం ఉండదని చెబుతోంది. 

"షూటింగ్ తర్వాత చేస్తున్న క్యారెక్టర్ ను వదిలేస్తాను. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా చేస్తున్న క్యారెక్టర్ గురించి ఆలోచించడం లాంటివి చేయను. గతంలో అలా చేసేదాన్ని. సినిమాలో చేస్తున్న పాత్రతో పాటు నేను ఇంటికొచ్చానంటే మా ఆయన చంపేస్తాడు. గేట్ బయటే వదిలేసి రమ్మంటారు. సాయంత్రం 6 తర్వాత  ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోను. చైతన్యతోనే ఉంటాను. ఇక సినిమా రిలీజైపోతే ఆ పాత్రతో కంప్లీట్ గా డిస్-కనెక్ట్ అయిపోతా."

ఇలా తమ దాంపత్యంలో శ్రీవారిముచ్చట్లలో మరో ఎపిసోడ్ ను బయటపెట్టింది సమంత. పెళ్లయి ఇన్నేళ్లయినా, ఓవైపు వయసు పెరుగుతున్నా తనలో చిలిపితనం, అల్లరి మాత్రం తగ్గలేదంటోంది సమంత. కాకపోతే వయసు పెరగడం వల్ల, బరువైన పాత్రలు చేయడం వల్ల ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తోందని చెప్పుకొచ్చింది.