దిల్ రాజుకు నో చెప్పిన సమంత

Samantha says no to Dil Raju
Thursday, January 30, 2020 - 10:15

దిల్ రాజు అడిగితే హీరోయిన్లు వద్దంటారా. కానీ సమంత మాత్రం నో చెప్పింది. దానికి కారణం జాను సినిమా. ఆ క్యారెక్టర్ చేయలేనేమో అనే భయంతో ముందుగా నో చెప్పానని అంటోంది శామ్.

"దిల్ రాజు కలవాలంటున్నారని నా మేనేజర్ నాతో చెప్పినప్పుడు వద్దన్నాను. నేను ఊళ్లో లేను, ఒంట్లో బాగాలేదని చెప్పమన్నాను. ఎందుకంటే జాను పాత్ర చేయడానికి భయమేసింది. ఓ క్లాసిక్ ను రీమేక్ చేయాలి. సుపీరియర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. త్రిషలా చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను."

దిల్ రాజును కలిస్తే ఓకే చెప్పేస్తానని తనకు తెలుసని ఫైనల్ గా అదే జరిగిందని అంటోంది సమంత. జాను సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం దిల్ రాజైతే మరో కారణం శర్వానంద్ అంటోంది. "షూటింగ్ లో ఒక్క రోజు కూడా ఈజీగా గడవలేదు. ఎందుకంటే మేజిక్ జరగాలి. కెమిస్ట్రీ పండాలి. అందుకే చాలా కష్టపడ్డాం. శర్వానంద్ లాంటి పార్టనర్ లేకపోతే అది సాధ్యం కాదు."

జాను సినిమాను ఆల్రెడీ చూశానని చెప్పిన సమంత, మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే విషయం తనకు తెలుస్తోందని అంటోంది. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వస్తోంది జాను.