సమంత తమిళం వైపు చూపు

Samantha signing Tamil movies
Monday, February 24, 2020 - 16:30

సమంత తమిళ సినిమాలపై ఆసక్తి చూపుతోందా? వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది మరి. తెలుగులో 'జాను' తర్వాత ఆమె మరో సినిమా అంగీకరించలేదు. కానీ తమిళంలో ఇప్పటికే నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో సినిమా సైన్ చేసేందుకు రెడీ అవుతోంది. చర్చలు జరుపుతోంది. 

ఆమె గర్భవతి అని అందుకే సినిమాలు ఒప్పుకోవడం లేదనేది మీడియా గాసిప్. తెలుగులో ఒప్పుకోకపోయినా తమిళంలో ఒప్పుకుంటుంది కదా. తెలుగులో సరైన స్క్రిప్ట్ లు ఆమె వద్దకి ఇంకా చేరలేదు. అందుకే కొత్త మూవీస్ అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఏ సినిమా పడితే అది ఒప్పుకునే ఆలోచనలో లేదు సమంత అక్కినేని. తన భర్త కెరీర్ సూపర్ గా సాగుతుండడంతో ఇంకా హ్యాపీగా ఉంది.