బిర్యానీ లేకపోతే ఉండలేను: సమంత

Samantha talks about her food habits
Friday, May 29, 2020 - 14:30

సమంత లాక్ డౌన్ డైరీస్

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఫస్ట్ టైమ్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది సమంత. ఈ క్వారంటైన్ టైమ్ లో ఆమె నేర్చుకున్న కొత్త వంటలు, చేస్తున్న పనులతో పాటు.. చాలా విషయాలు షేర్ చేసుకుంది.

- గోంగూర పచ్చడి ఎప్పుడైనా తిన్నారా
చాలాసార్లు తిన్నాను.. గోంగూర పెంచుతున్నాను కూడా

- మిమ్మల్ని ఇష్టపడని వాళ్లకు మీరిచ్చే సమాధానం
నాకు స్పూర్తినిస్తున్నారనే విషయాన్ని మీరు (ఇష్టపడని వాళ్లు) గ్రహించడం లేదు. నవ్వుతున్న ముఖాలు, నవ్వుతూ ఇచ్చే ప్రశంసలు నన్ను సోమరిపోతును చేస్తున్నాయి. అవమానాలు నన్ను మరింత మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రేరేపిస్తాయి.  

- మామిడి పండ్లు తింటున్నారా
ప్రతి రోజూ 2 తింటున్నాను

- ఈ క్వారంటైన్ టైమ్స్ ఫిట్ గా ఉండేందుకు ఫాస్టింగ్ ఉంటున్నారా
పూర్తిస్థాయిలో ఫాస్టింగ్ (ఉపవాసం) ఉండను. నామమాత్రంగా అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తుంటాను. ఎందుకంటే రోజుతప్పించి రోజు నాకు బిర్యానీ ఉండాల్సిందే. అంతేకాదు.. ఆల్రెడీ 3 బాటిల్స్ పచ్చళ్లు ఖాళీచేశాను. ఎందుకంటే స్పైసీ ఫుడ్ అంటే నాకిష్టం. సో.. ఫాస్టింగ్ అనేది నన్ను మళ్లీ గుడ్ గర్ల్ గా మారుస్తుందనుకుంటున్నాను.

- ఎవరు ఎక్కువ వర్కవుట్ చేస్తారు
కచ్చితంగా చైతూనే ఎక్కువ జిమ్ చేస్తాడు. నేను నటిస్తుంటాను

- రష్మిక గురించి
ఆమె చాలా హార్డ్ వర్కర్. ఆమె డాన్స్ చాలా బాగుంటుంది

- ఓ సెలబ్రిటీగా బాగా కష్టపని పని ఏంటి
మనకు సంబంధించిన అబద్ధాల్ని మనమే వినాల్సి రావడం

- కాఫీ లేదా టీ
ఎప్పుడైనా, ఎక్కడైనా బ్లాక్ కాఫీ

- ఈ లాక్ డౌన్ టైమ్ లో నేర్చుకున్న వంటకం
షక్ షుకా (గుడ్డు, టమాటతో చేసే బ్రేక్ ఫాస్ట్)