టీవీ తెరపై సమంత హల్ చల్

Samantha's Jaanu posts big numbers on TV
Thursday, April 23, 2020 - 17:15

సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ లో కూడా సమంతకు ఫ్యాన్స్ ఉన్నారు. అ..ఆ సినిమాకు ఇప్పటికీ రేటింగ్ వస్తుందంటే దానికి కారణం సమంత అనే వాళ్లున్నారు. పోనీ అందులో హీరో నితిన్, దర్శకుడు త్రివిక్రమ్ కాబట్టి క్రెడిట్ వాళ్లకు కూడా వెళ్తుంది. మరి "ఓ బేబీ"  సంగతేంటి? పూర్తిగా సమంతపై నడించిన ఈ సినిమాకు బుల్లితెరపై అప్పట్లో మంచి టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు మరోసారి సమంత తన మేజిక్ చూపించింది. ఆమె నటించిన జాను సినిమాకు చెప్పుకోదగ్గ రేటింగ్ వచ్చింది.

స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 12వ తేదీన ప్రసారమైన ఈ సినిమాకు 9.61 టీఆర్పీ వచ్చింది. గతంలో సమంత నటించిన ఓ బేబీ సినిమాకు వచ్చిన రేటింగ్ (అర్బన్-9)తో పోలిస్తే ఇది ఇంకాస్త ఎక్కువ. 2019లో టాప్-10 టీఆర్పీ లిస్ట్ తీస్తే అందులో సమంత నటించిన ఓ బేబీ సినిమాకు ఐదోస్థానం దక్కింది. ఈ ఏడాది కూడా సమంత-శర్వానంద్ నటించిన జాను సినిమా టాప్-10 లిస్ట్ లో చేరడం ఖాయం. అలా ఈ సినిమా వెండితెరపై ఫ్లాప్ అయినా బుల్లితెరపై సూపర్ హిట్టయింది.

Also Check: Samantha Latest Stills

ఇక ఈ వారం రేటింగ్స్ లో కూడా ఈటీవీ న్యూస్ హవా కొనసాగిందింది. పెద్ద సినిమాల్లేకపోవడం, సూపర్ సీరియల్స్ ఆగిపోవడంతో ఈటీవీ న్యూస్ కు వరుసపెట్టి రేటింగ్స్ వస్తున్నాయి. వీటితో పాటు సినిమాలపరంగా సైరా, నేలటిక్కెట్, వినయ విధేయరామ రిపీటెడ్ లో కూడా తమ సత్తా చాటాయి.