స‌మంత ప్లాన్ అదుర్స్‌

Samantha's plan of promoting hand looms becomes successful
Sunday, May 28, 2017 - 20:30

చేనేత వస్ర్తాలని ప్ర‌మోట్ చేయాల‌నేది స‌మంత ఉద్దేశం. అందుకే త‌నంత‌ట త‌నే తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. దాంతో ప్ర‌భుత్వం ఆమెని అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టించింది. తాజాగా ఆమె ఒక ఫోటోసూట్ చేసింది. ఈ ఫోటోసూట్ సూప‌ర్‌డూప‌ర్ వైర‌ల్ అయింది సోష‌ల్ మీడియాలో. 

ఒక మేగ‌జైన్‌కి చేసిన ఈ ఫోటోసూట్‌లో ఆమె చాలా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఆమె నాభి షో మ‌గాళ్ల‌ని ఖుషీ చేసింది. అయితే ఈ ఫోటోసూట్ వెనుకున్న ఉద్దేశం చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌మోట్ చేయ‌డ‌మే. ఆమె ప‌క్కా పోచంప‌ల్లి కాట‌న్‌ని ధ‌రించింది. హ్యాండ్‌లూమ్స్‌కి మాడ్ర‌న్ ట‌చ్ ఇచ్చింది. ఆమె ఫోటో దేశ‌మంతా ట్రెండ్ అయింది. మ‌గాళ్ల క‌న్ను ఆమె నాభి షో మీద ప‌డినా... ఆడ‌వారు మాత్రం ఆమె డ్రెస్సుపైనే దృష్టి నిలిపారు. అలా ఆమె అనుకున్న ల‌క్ష్యం నెర‌వేరింది. 

త్వ‌ర‌లో పెళ్లి చేసుకునే టైమ్‌లో ఇలాంటి ఫోటోసూట్‌లు అవ‌స‌ర‌మా అని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఆమె అలా చేసింది చేనేత వస్ర్తాల ప్ర‌మోష‌న్ కోసం. సో..ఆమె నాభి ప్ర‌ద‌ర్శ‌న హిట్టు. ఆమె ఉద్దేశం కూడా సూప‌ర్ హిట్‌.