ఎన్టీఆరే ది బెస్ట్‌.. సమంత ఓటు

Samanths says NTR is the best dancer
Tuesday, September 24, 2019 - 14:30

టాలీవుడ్‌లో డ్యాన్స్‌లో కింగ్‌ ఎవరంటే ..మెగాస్టార్‌ చిరంజీవి అనే సమాధానం ఇస్తారు ఎవరైనా. మరి ఆ తర్వాత జనరరేషన్‌లో ఎవరు బెస్ట్‌ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో డ్యాన్స్‌లో రచ్చ లేపే హీరోలున్నారు మనకి. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌.. ఎవరినీ డ్యాన్స్‌లో వంక పెట్టలేం. అందరూ ఇరగ ఇరగ  ఇరగదీస్తారు.

మరి చరణ్‌తో రంగస్థలంలోనూ, బన్నితో సన్నాఫ్‌ సత్యమూర్తి,, ఎన్టీఆర్‌తో మూడు సినిమాల్లో నటించిన సమంత దృష్టిలో బెస్ట్‌ డ్యాన్సర్‌ ఎవరు? సమంత తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. మంచు లక్ష్మీ నిర్వహిస్తున్న టాక్‌ షోలో ఆమె ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. ఎన్టీఆర్‌ని మించిన డ్యాన్సర్‌ లేదని చెప్పింది. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్‌ వంటి సినిమాల్లో ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా నటించింది సమంత. 

"సెట్‌లోకి వచ్చిన వెంటనే సింగిల్‌ టేక్‌లో డ్యాన్స్‌ చేసే హీరో ఎన్టీఆర్‌. అలాంటి హీరోతో స్టెప్పులు వేయడం అంటే నాకు టెన్సన్‌ పెరిగేది. ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌ అంటే చాలా కష్టపడాలి," అని చెప్పింది సమంత