రోల్ సింగిల్‌, భామ‌లు డ‌బుల్‌

Sampath Nandi says Gopichand is not playing dual role in Gautham Nanda
Wednesday, June 28, 2017 - 19:00

గోపీచంద్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడా? స‌ంప‌త్ నంది తీస్తున్న ‘గౌతమ్‌నంద’లో ఆయ‌న డ‌బుల్ రోల్‌లో క‌నిపిస్తాడ‌నేది టాక్‌. అయితే గోపిచంద్‌ది డ్యూయ‌ల్ రోల్ కాదంటున్నాడు ద‌ర్శ‌కుడు. రెండు పాత్ర‌లు కాదు రెండు షేడ్స్ ఉంటాయ‌ట‌. 

సినిమా ట్ర‌యిల‌ర్లో గోపిచంద్ బాగా ధ‌న‌వంతుడైన యంగ్‌స్టర్‌గానూ, ప‌క్కా మాస్ కుర్రాడిగానూ క‌నిపించాడు. ఒకే పాత్ర అలా రెండు షేడ్స్‌లో క‌నిపిస్తుందా? డ‌్యూయ‌ల్ రోలా? అన్న డౌట్స్ అప్ప‌టి నుంచే మొద‌ల‌య్యాయి. ఈ అనుమానాల‌కి ఆయ‌న ఫుల్‌స్టాప్ పెట్టాడు. కానీ గోపిచంద్ ఇందులో ఇద్ద‌రి భామ‌ల‌తో పాట‌లు వేసుకుంటాడు. హీరో సింగిల్ రోల్‌లో క‌నిపించిన ఇద్ద‌రి భామ‌ల‌తో డ్యూయెట్‌లు పాడుకోవాల‌నేది మ‌న మాస్ సినిమాల సూత్రం క‌దా. సో.. స్ఫూర్తి అనే పాత్రలో హన్సిక, ముగ్ధగా కేథరిన్ క‌న‌పిస్తారు. ఇద్ద‌రూ గ్లామ‌ర్ డాల్సే. సో క‌నువిందుకి ఢోకాలేదు.

ఇదంతా స‌రే ఇంత‌కీ రిలీజ్ ఎపుడు? గగోపిచంద్ సినిమాలు ఈ మ‌ధ్య ఏవీ విడుద‌ల‌కి నోచుకోవ‌డం లేదు. మ‌రి ఈ నందా అయినా ఏ ఇబ్బంది లేకుండా థియేట‌ర్ల‌లోకి వ‌స్తాడా?