దంగల్ అమ్మాయిల డేటింగా?

Sana Fatima clears air about Sanya Malhotra
Monday, July 20, 2020 - 09:00

అమీర్ ఖాన్ నటించిన "దంగల్" సినిమా భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన వసూళ్లు "బాహుబలి 2" కన్నా ఎక్కువ. "దంగల్" సినిమాలో అమీర్ ఖాన్ కూతుళ్లు గా నటించిన ఫాతిమా సన, సానియా మల్హోత్రా గురించి ఇప్పుడు రూమర్లు మొదలయ్యాయి.

వీళ్లద్దరూ లెస్బియన్స్ అని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ రూమర్లపై ఫాతిమా సనా స్పందించింది. "ఈ మాట నేను కూడా విన్నాను. నవ్వి ఊరుకోవడం తప్ప చేసేదేమి లేదు. మేము ఎప్పుడూ కలిసే మీడియా కంట పడతాము కాబట్టి ఆలా అనుకోని ఉంటారు. కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మొదట మా అమ్మ భయపడింది. ఆమెకి క్లీయర్ గా చెప్పక... ఇలాంటి పుకార్లను లైట్ తీసుకుంటోంది," అని వివరించింది

ఫాతిమా. బాలీవుడ్ లో గే (మగవాళ్ల మధ్య లవ్), లెస్బియన్ (ఆడవాళ్ళ మధ్య బంధం) రిలేషన్ షిప్స్ ఎక్కువే. అందుకే వీరి గురించి ఆలా పుకార్లు వచ్చాయి. ఇంతకుముందు .... ఫాతిమా,  అమిర్ ఖాన్ గురించి పుకార్లు వచ్చాయి. "ఇలాంటి వార్తలు చదివి చదివి స్పందించడం మానేశాను. ఏ పుకార్లు లేకపోతే బాలీవుడ్ లో పట్టించుకోరు. సో అందుకే వీటి గురించి ఎక్కవ ఆలోచించొద్దు," అని చెప్తోంది ఫాతిమా.