సనా ఇప్పుడు హాట్ బ్యూటీ

Sana Saeed creating sensation on social media
Friday, January 24, 2020 - 16:45

కుచ్ కుచ్ హోతా హై సినిమా పేరు చెప్పగానే షారూక్ ఎలా గుర్తొస్తాడో, అందులో బాలనటిగా నటించిన చిన్నారి సనా సయీద్ కూడా అంతే గుర్తొస్తుంది. అప్పట్లో ఆమె పెర్ఫార్మెన్స్ కు అంతా ఫిదా అయ్యారు. అప్పట్లో ఆ పాప స్టయిల్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇప్పుడు మరోసారి ఆమె పాపులర్ అయింది. చిన్నారి సనా కాస్తా ఇప్పుడు హాట్ సనాగా మారిపోయింది.

అవును.. సనా సయీద్ ఇప్పుడు బడా హీరోల సరసన ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వారం రోజులుగా ఆమె మినిమం గ్యాప్స్ లో బికినీ ఫొటోలు పెడుతూ అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. అప్పటి చిన్నారి సనాయేనా ఈమె అంటూ ఆమె బికినీ పోజులు చూస్తూ, అవాక్కవుతూనే ఆస్వాదిస్తున్నారు.

టెలివిజన్ లో ఇప్పటికే ఈమె పిచ్చ పాపులర్. సోనీ, స్టార్ ప్లస్, కలర్స్, జీటీవీ.. ఇలా ఈ ఛానెల్, ఆ ఛానెల్ అనే తేడాలేకుండా నార్త్ ను దున్నేస్తోంది. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం జోరుగా ప్రయత్నిస్తోంది. 2-3 సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. అందుకే ఇప్పుడిలా హాట్ హాట్ ఫొటో షూట్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది.