ఆ భామ 60 ఏళ్ల బామ్మ!

Sangeeta Bijlani celebrates 60th birthday
Friday, July 10, 2020 - 08:00

ఈ మాజీ హీరోయిన్ కి  60 ఏళ్ళు!

బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీ గుర్తుందా? ఒకప్పుడు చాలా ఫేమస్. సూపర్ బ్యూటీ. మోడలింగ్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చింది. "త్రిదేవ్", "జుర్మ్", "యుగంధర్" వంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో నటించింది. మన హైదరాబాదీ, క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య.

ఈ అందెగత్తెకిప్పుడు 60 ఏళ్ళట. నమ్మశక్యంగా లేదు కదా. అలా బాడీ మైంటైన్ చేస్తోంది మరి.

నిన్న (జులై 9) ఆమె తన 60వ పుట్టిన రోజును జరుపుకొంది. కరోనా కాలం కావడంతో ఎవరూ గెస్ట్ లు రాలేదు. తానే కేక్ తెచ్చుకొని .... బాలీవుడ్ మీడియా ఫోటోగ్రాఫర్ ల ముందు కట్ చేసింది. ఆమెకి 60 ఏళ్ళు అంటే నమ్మలేము.