ట్రాజెడీ సీన్ అయినా మేకప్ కంపల్సరీ

Sanjana caught touching makeup during Sushanth's death live show
Monday, June 15, 2020 - 17:15

మేకప్ లేకుండా హీరోయిన్లు బయటకు రారు. ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా వీడియో ఛాట్స్ లో మేకప్తోనే కనిపించారు. అది వాళ్ల జన్మహక్కు కూడా. కాకపోతే దీనికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. ఈ మేకప్ పిచ్చితో హీరోయిన్ సంజనా గల్రానీ ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయింది. ప్రస్తుతం ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది.

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఓ జాతీయ ఛానెల్ లైవ్ పెట్టింది. పలువురు సినీప్రముఖులు, మానసికవేత్తలు ఆ లైవ్ లో ఉన్నారు. అందులోకి సంజనా గల్రానీని కూడా ఆహ్వానించారు. అయితే ఓవైపు సీరియస్ గా సుశాంత్ ఆత్మహత్యపై చర్చ జరుగుతుంటే.. మరోవైపు సంజనా లైవ్ లో తన ఐబ్రోస్ సరిదిద్దుకుంది. కనుబొమ్మలకు పెన్సిల్ రాసుకుంది.

సంజనా గల్రానీ చేసిన ఈ పనికి అంతా షాక్ అయ్యారు. అక్కడ నడుస్తున్న చర్చ ఏంటి... సంజనా చేస్తున్న పనేంటి అంటూ ఓ రేంజ్ లో ఆమెపై విరుచుకుపడుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై సంజనా రియాక్ట్ అయింది. లైవ్ లోకి తీసుకున్నారనే విషయం తనకు తెలియదని, కనీసం యాంకర్ కూడా తన పేరు చెప్పలేదని.. అలా ఏం చెప్పకుండానే తనను లైవ్ లోకి తీసుకున్నారని అంటోంది. ఇది కేవలం సాంకేతిక తప్పిదమే తప్ప, తను కావాలని లైవ్ లో మేకప్ వేసుకోలేదంటోంది సంజన.

దీనికి సంబంధించి కొద్దిసేపటి కిందట ఆమె సుదీర్ఘంగా ఓ వివరణ కూడా ఇచ్చుకుంది. అయితే ఆ వివరణతో సంబంధం లేకుండా.. లైవ్ లో సంజన మేకప్ వేసుకుంటున్న క్లిప్ వైరల్ అవుతోంది. ఆమె ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది.