ఊపు తీసుకురాని సంక్రాంతి

Sankranthi 2018 fails to bring happiness to Telugu trade
Saturday, January 13, 2018 - 18:45

సంక్రాంతి పెద్ద సినిమాల‌న్నీ విడుద‌లయ్యాయి. ప‌వ‌ర్‌స్టార్ న‌టించిన అజ్ఞాత‌వాసి, బాల‌య్య తీసుకొచ్చిన జై సింహా, సూర్య న‌టించిన గ్యాంగ్‌.. ఏ సినిమా కూడా భారీ క‌లెక్ష‌న్ల మోత మోగించ‌లేక‌పోయింది. ఈ మూడు సినిమాల్లో గ్యాంగ్ బెట‌ర్‌గా ఉంద‌ని క్రిటిక్స్ తేల్చారు.

ఐతే గ‌తేడాదిలా మూడు సినిమాలు విజ‌యం సాధిస్తాయ‌ని ట్రేడ్ పండితులు వేసుకున్న లెక్క‌లు తారుమారు అయ్యాయి. గ‌తేడాది చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, శ‌ర్వానంద్ హీరోగా దిల్‌రాజు నిర్మించిన శ‌త‌మానం భ‌వ‌తి..మూడు విజ‌యం సాధించాయి. మూడు సినిమాలు క‌లిపి దాదాపు 170 కోట్ల రూపాయ‌ల షేర్‌ని రాబ‌ట్టాయి.

2018 సంక్రాంతి మాత్రం బాక్సాఫీస్‌కి ఊపు తీసుకురాలేదు. ఈ ఏడాదికిది బ్యాడ్‌స్టార్ట్‌.