సంక్రాంతికి 300 కోట్ల బెట్టింగ్

Sankranthi big fight
Sunday, December 9, 2018 - 14:15

సంక్రాంతికి మూడు సినిమాల రాక ప‌క్కాగా క‌న్‌ఫ‌మ్ అయింది. మ‌రో త‌మిళ అనువాద చిత్రం కూడా బ‌రిలో ఉండేలా క‌నిపిస్తోంది. సో మొత్తంగా మూడు తెలుగు సినిమాలు, ఒక అనువాద చిత్రంతో దాదాపు 300 కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌ర‌గ‌నుంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి 60 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రిగే అవ‌కాశం ఉంది. బాల‌య్య సినిమాల‌కి అంతా బిజినెస్ అవ‌దు. కానీ ఇది ఎన్టీఆర్ బయోపిక్ కావ‌డం, ఈ సినిమా ఇప్ప‌టికే అంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తిని రేప‌డంతో.. ఫోక‌స్ అంతా దీనిపైనే ఉంది. క్రేజ్ కూడా మామూలుగా లేదు. అందుకే, థియేట్రిక‌ల్‌తో పాటు ఇత‌ర వ్యాపారం 90 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచనా.

ఇక రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ సినిమాకి 100 కోట్ల‌పైనే బిజినెస్ జ‌ర‌గ‌డం ఖాయం. ఈ ఏడాది రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం ఏకంగా 125 కోట్ల థియేట్రిక‌ల్ రెవిన్యూ, మ‌రో 20 కోట్ల ఇత‌ర వ్యాపారాన్ని జ‌రుపుకొంది. ఆ లెక్క‌న్న బోయ‌పాటి, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ మాస్ మూవీ 100 కోట్ల‌పైనే ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుంది.

బ‌రిలోవెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ఎఫ్ 2 కూడా ఉంది. ఈ సినిమాకి ఒక 30, 40 కోట్ల వ‌ర‌కు వ్యాపారం జ‌రిగే అవ‌కాశం ఉంది. ఇక ఇత‌ర డ‌బ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా బ‌రిలోఉంటే దాదాపు 300 కోట్ల రూపాయ‌ల బెట్టింగ్ ఉంటుంది.