ఈసారి సంక్రాంతి వీళ్లదే

Sankranthi2021 Tollywood stars
Wednesday, July 29, 2020 - 17:00

సంక్రాంతి సినిమాలంటే అందులో బాలయ్య మూవీ ఉండాల్సిందే. లేదంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు పోటీ పడాలి. లేకపోతే ఎప్పట్లానే రజనీకాంత్ మూవీ ఉండాలి. ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు కూడా సంక్రాంతికి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి మాత్రం కాస్త విభిన్నంగా ఉండబోతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వచ్చేది అనుమానమే. దీంతో నెక్ట్స్ లెవెల్లో ఉన్న హీరోలంతా తమ సినిమాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నితిన్, తన కొత్త సినిమా "రంగ్ దే"ను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడీ రేసులోకి అఖిల్ కూడా చేరిపోయాడు.

"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికే వస్తుందని తాజాగా ప్రకటించారు. అఖిల్ కు తొలి సంక్రాంతి సినిమా ఇదే కానుంది.

వీళ్లతోపాటు శర్వానంద్ కూడా సంక్రాంతిపై కన్నేశాడు. అతడు నటిస్తున్న "శ్రీకారం" సినిమాను సంక్రాంతికే అనుకుంటున్నారు. ఇలా చిరంజీవి, పవన్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి హీరోలు కాకుండా.. నితిన్, అఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఈ సంక్రాంతికి వస్తున్నారన్నమాట.