సరిలేరు నీకెవ్వరు: 5 రోజుల్లో 68 కోట్లు

Sarileru 5 days collections
Thursday, January 16, 2020 - 15:45

మహేష్ స్టామినా మరోసారి ఎలివేట్ అయింది. అతడు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 5 రోజుల్లో 68 కోట్లు కలెక్ట్ చేసింది. తాజా వసూళ్లతో ఈ సినిమా ఓవరాల్ గా 80 శాతం బ్రేక్ ఈవెన్ అయినట్టయింది. ఈ వీకెండ్ గడిచేసరికి ఏపీ,నైజాంలో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

అఫీషియల్ గా ఇప్పటివరకు ఈ సినిమా ఈస్ట్, వెస్ట్ లో బ్రేక్ ఈవెన్ అయింది. మరో 2 రోజుల్లో గుంటూరు, ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సోమవారం నాటికి బయ్యర్లంతా పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాబట్టుకుంటారని ట్రేడ్ అంచనా వేస్తోంది.

నిన్నటితో 5వ రోజు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 22.5 కోట్లు
సీడెడ్ – రూ. 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 10.05 కోట్లు
ఈస్ట్ – రూ. 6.22 కోట్లు
వెస్ట్ – రూ. 4.54 కోట్లు
గుంటూరు – రూ. 7.19 కోట్లు
నెల్లూరు – రూ. 2.42 కోట్లు
కృష్ణా – రూ. 5.55 కోట్లు