ఓవర్సీస్ మార్కెట్ కి జోష్ వచ్చింది!

Sarileru Neekevvaru and Ala Vaikunthapurramlo brought josh to USA BO
Saturday, January 11, 2020 - 23:00

ఏడాది గ్యాప్ తర్వాత అమెరికా మార్కెట్ కి మళ్ళీ జోష్ వచ్చింది. గతేడాది తెలుగు పెద్ద సినిమాలన్నీ అమెరికాలో బోర్లా పడ్డాయి. సాహో, సైరా, వినయ విధేయ రామ, మహర్షి వంటి బడా సినిమాలన్నీ నష్టాలనే మిగిల్చాయి. అమెరికా మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుందా అన్న డౌట్స్ కూడా ట్రేడ్ పండితులు రైజ్ చేశారు. ఐతే, కొత్త ఏడాది కొత్త ఆశలను మోసుకొచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' అప్పుడే వన్ మిలియన్ డాలర్ల వసూళ్ళని దాటేసింది. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన 'అల వైకుంఠపురంలో' మహేష్ బాబు సినిమాకన్నా భారీ ఓపెనింగ్స్ ని పొందింది. 

మహేష్ బాబు సినిమా... 7 లక్షల 60 వేల డాల్లర్లని పొందితే ... అల్లు అర్జున్ మూవీ 8 లక్షల పైగా డాలర్లను దక్కించుకొంది. అంటే మహేష్ సినిమా కన్నా ఎక్కువగా రాబట్టింది. 

ప్రీమియర్ షోలలో అల్లు అర్జున్ కెరీర్ లోనే పెద్ద రికార్డు ని క్రియేట్ చేసింది 'అల వైకుంఠపురంలో'. ఈ రెండు సినిమాలు కూడా 2 మిలియన్ కి పైగా వసూళ్లు పొందే ఛాన్స్ కనిపిస్తోంది. అంటే... మరోసారి అమెరికా మార్కెట్ కి ఊపు తెచ్చాయి. 

అమెరికా మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురంలో' చిత్రాల సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది అని తెలుగుసినిమా.కామ్  ఇంతకుముందే రాసింది. ఈ రెండు తెచ్చిన ఊపు చూస్తేంటే... తిరిగి కళ వచ్చినట్లే. ఐతే, పూర్తి రన్ వరకు ఆగాలి. ఆ తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది.