మీది వన్నా ..ఐతే మాది టు!

Sarileru Neekevvaru collection posters get trolling
Tuesday, January 28, 2020 - 11:45

'అల వైకుంఠపురంలో' సినిమా నిన్న సాయంత్రం ప్రెస్  మీట్ నిర్వహించింది. తమ సినిమా నాన్ - బాహుబలి (అంటే బాహుబలి మొదటి భాగం, రెండో భాగం తర్వాత) రికార్డ్ సాధించింది అని టీం ప్రకటించింది. ఓవర్సీస్ కలెక్షన్ల ట్రెండ్, మల్టీప్లెక్స్ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే ఇది నమ్మదగ్గట్లుగానే ఉంది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు కూడా ఇదే మాట అంటున్నారు. ఇది హ్యూజు అనేది నిజం. 

అయితే, ఈ సినిమాకి పోటీగా విడుదల అయిన 'సరిలేరు నీకెవ్వరు' మాత్రం ఏమి తక్కువ తినలేదు. ఇది కూడా భారీ విజయం సాధించింది. ఈ సంక్రాంతి తెలుగు సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇది కూడా హిట్ అనేది పక్కా నిజం. ఐతే, ఈ సినిమా బాహుబలి 1 రికార్డులు కొల్లగొట్టి ...బాహుబలి 2 తర్వాత స్థానాన్ని సాధించింది అని ప్రకటించింది. అది కూడా 'అల వైకుంఠపురంలో' ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ... పోస్టర్ వచ్చింది. 

ఇక్కడ చిన్న షరతులు వర్తిస్తాయి అని చిన్న లైన్ కూడా ఉంది. ఏపీ, తెలంగాణ లో బాహుబలి 1 రికార్డ్ దాటింది అనేది ఆ షరతు. అయితే, ఇది ఈ రకంగా చూసినా నమ్మదగ్గట్లు లేదు. అందుకే.. ఫేకింగ్ సరిలేరు మీకెవ్వరు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగట్లేదు. అసలు మీది బాహుబలి 1 తర్వాతి స్తానం అయితే మాది బాహుబలి 2 నెక్స్ట్ పోజిషన్ అని సరిలేరు టీమ్ డబ్బా కొట్టుకోవడం అవసరమా. ఎందుకు ఈ పోస్టర్ల పోటీ.